Thursday, January 23, 2025

ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

Vey dharuvey movie launched

శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరో శర్వానంద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ప్లాన్ చేశాము. ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News