Wednesday, January 22, 2025

కోమటిరెడ్డి… కోవర్టు రెడ్డి కావొద్దు: విహెచ్

- Advertisement -
- Advertisement -

V Hanumantha Rao Fire on NJP Leaders

మునుగోడు: కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళక పోవడం సరికాదని కాంగ్రెస్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నదమ్ములు వేరు వేరు పార్టీల్లో ఉండటం కొత్త కాదని, తాను ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకునే వెంకట్ రెడ్డి ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. స్టార్ క్యాంపెయినర్ గా ఉండి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవడం విమర్శలకు తావిస్తోందని వెంకట్ రెడ్డిపై విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు వెంకట్ రెడ్డి విదేశాలకు వెళ్ళడం సరికాదని, ఇలాంటి ప్రవర్తన వల్ల టిఆర్ఎస్ నేతలు కోవర్టు రెడ్డి అంటున్నారని, వెంకట్ రెడ్డి మునుగోడు ప్రచారానికి వెళ్ళక పోతే  కోవర్టు రెడ్డి అనేది నిజమౌతుందని స్పష్టం చేశారు. వెంకట్ రెడ్డి ప్రవర్తన వల్ల ఆయన ఇంటి పేరు కూడా మారుతుందని, తాను వెంకట్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశాను కానీ కలవలేదని, ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు మార్చుకోవాలని చేతులు జోడించి అడుగుతున్నానని విహెచ్ వేడుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News