Saturday, January 11, 2025

ఈటల రాజకీయ అజ్ఞాని: విహెచ్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం బ్యూరో : బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు విహెచ్.అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈటల చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు ఈటేల బీజేపి లో చేరిన తప్పును కప్పి పుచ్చే పనిలో నిమగ్నమయ్యారని, ప్రజా సమస్యలను వదిలేసి కాంగ్రెస్‌పై నిరాదరా అరోపణపలు చేయడం పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజెపి ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికార పార్టీలో ఉన్న రాజేందర్ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పై ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఏ అధికారం లేకపోయినా సీఎం కేసీఆర్‌పై కేసులు పెట్టినా ఎదుర్కోంటున్న దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. అలాంటి వ్యక్తి పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు.

దమ్ము ధైర్యం ఉంటే ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడలని సవాల్ విసిరారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని విహెచ్ డిమాండ్ చేశారు నిరుద్యోగులను, రైతులను కేసీఆర్ నిలువునా మోసం చేస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటదని అన్నారు. దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యలపై కొట్లడుతున్నరాని అన్నారు. అందుకే వారిపై లేని పోని అవాకులు చెవాకులు పేలి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి అధికారం వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటున్నారని అన్నారు.

ఇది ప్రశ్నించినందుకు రాహుల్ పై అనర్హత వేటు వేసి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించారని అన్నారు. నిరుద్యోగ సమస్యపై సోమవారం ఖమ్మం నగరంలో జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీకి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఈ ర్యాలిని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మాజీ మత్రి సంబాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పోరాటాల పురిటగడ్డ ఖమ్మం అని ఖమ్మం నుండి ఏ ఉద్యమం మొదలు పెట్టిన అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని అన్నారు. నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుధ్యోగ పోరుబాట నిర్వహిస్తున్నామని ఈ ఉద్యమంతో అధికార పార్టీ వెన్నూల్లో వణుకు పుట్టించాలని అన్నారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయని అన్నారు.ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు 2500 నిరుద్యోగ భృతి కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు.

జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, జావేద్ మాట్లాడుతూ.. నిరుధ్యోగ నిరసన ర్యాలీ ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈవిలేఖర్ల సమావేశంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి రాపోలు జయ ప్రకాశ్, కొండేటి మల్లయ్య, నర్సింహారెడ్డి, బాలు నాయక్, ఆవుల రాజీరెడ్డి, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఏమ్మెల్సి పోట్ల నాగేశ్వరావు, వడ్డె నారాయణ రావు,బెల్లం శ్రీనివాసరావు, జ్ఞానేశ్వర్, కొత్త సీతారాములు, బొడ్డు బొందయ్య, పుచ్చకాయల వీరభద్రం, కొండూరు కిరణ్ కుమార్, కొంటేముక్కల నాగేశ్వర్ రావు, బేహెచ్ రబ్బానీ, మలీదు వెంకటేశ్వర్లు, సైదులు నాయక్, కిరణ్ కుమార్,సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News