Saturday, December 21, 2024

రాహుల్ టూర్‌తో నేతల్లో నూతనోత్తేజం : విహెచ్

- Advertisement -
- Advertisement -

VH praise rahul gandhi tour

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్‌తో నేతల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలు గ్రామాలలో తిరగాలని రాహుల్ ఆదేశించారని తెలిపారు. ఇక నుండి తామంతా గ్రామాలలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని చెప్పారు. రైతులకిచ్చిన రైతు డిక్లరేషన్‌ను రైతు లకు వివరిస్తామన్నారు. “నేను గ్రామాలలో తిరుగుతా, ఎవరు కలిసొచ్చినా కలుపుకుని పోతా” అని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకుని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సమస్యలను పరిష్కరిస్తామని విహెచ్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News