Monday, January 20, 2025

నాకు టికెట్ రాకుండా భట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారు

- Advertisement -
- Advertisement -

రేవంత్‌ను సిఎం చేయాలని
చెప్పినందుకే నాపై కక్ష గట్టారు
విహెచ్ సంచలన వ్యాఖ్యలు

విహెచ్ సంచలన వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్ : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు (విహెచ్) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపి టికెట్ తనకు రాకుండా భట్టి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఆయన సతీమణికి ఎంపి టికెట్ కోసం భట్టి ప్రయత్నిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డిని సిఎంని చేయాలని తానే సలహా ఇచ్చానని, అందుకే భట్టికి తనపై కోపం ఉందని సంచలన కామెంట్స్ చేశారు. దానిని మనసులో పెట్టుకుని తనకు ఎంపి టికెట్ రాకుండా భట్టి అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

సిఎం రేవంత్ ్డ, భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తల్చుకుంటే తనకు ఖమ్మం ఎంపి టికెట్ వస్తుందన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపి టికెట్ తనకే దక్కుతుందనే నమ్మకం ఉందన్నారు. కాగా, ఖమ్మం ఎంపి టికెట్‌కు కాంగ్రెస్‌లో భారీ డిమాండ్ ఉంది. ఈ టికెట్ కోసం భట్టి, మంత్రి పొంగులేటి సోదరుడు, భట్టి సతీమణి, మంత్రి తుమ్మల కొడుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, తనకు టికెట్ రాకుండా భట్టి అడ్డు పడుతున్నారని మొదటి నుండి విహెచ్ ఆరోపిస్తున్నారు. విహెచ్ వ్యాఖ్యలపై గతంలోనే ఓ సారి భట్టి క్లారిటీ ఇచ్చినప్పటికీ, విహెచ్ మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News