మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ ఎంపికపై మరోసారి విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విధేయులకు విలువ, ఆత్మగౌరవం లేదా అని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తామంటే అది తమకు అవమానం కాదా అని నిలదీశారు.జ ఇక్కడ పిసిసి అధ్యక్షుడు రాజీనామా చేసినా ఆయన అదృష్టం బాగుండి తిరిగి కొనసాగుతున్నారన్నారు. కర్ణాటకలో కొత్త పిసిసి కోసం పరిశీలకుడిని పంపించారని, పంజాబ్‌లో కూడా అదే జరుగుతోందని ఒకక తెలంగాణలోనే మాణికం ఠాగూర్ ఒకకరే అభిప్రాయ సేకరణ చేశారని విహెచ్ విమర్శించారు. కాంగ్రెస్‌లో తనను పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానానికి లేఖలు రాస్తే తప్పుబడుతున్నారని, 2018 నుంచి ఇప్పటివరకు ఒక్క సమీక్ష కూడా జరగలేదని ధ్వజమెత్తారు. పిసిసి అధ్యక్ష పదవిని విధేయులకు ఇవ్వాలని డిమాండ్ చేయడం తప్పా అని ప్రశ్నించారు. బయటవాళ్లను అందలం ఎక్కించే ముందు వారి ట్రాక్ రికార్డు కూడా పరిశీలించాలని సూచించారు. రాష్ట్రానికి ఇంఛార్జిగా వచ్చి ఇప్పటివరకు ఏమి చేశారో మాణికం ఠాగూర్ చెప్పాలని విహెచ్ నిలదీశారు.
టిపిసిసి చీఫ్ ఎంపికపై మరోసారి విహెచ్ సంచలన వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -