Sunday, January 19, 2025

విహెచ్‌పి నేత కాల్చివేత

- Advertisement -
- Advertisement -

పంజాబ్ నంగల్‌లో ఘటన
నంగల్ (పంజాబ్) : విశ్వ హిందు పరిషత్ (విహెచ్‌పి) నంగల్ శాఖ అధ్యక్షుడు వికాస్ బగ్గాను గుర్తు తెలియని దుండగులు శనివారం ఆయన దుకాణంలో కాల్చి చంపారు. నంగల్‌లోని రైల్వే రోడ్డులో తన కన్ఫెక్షనరీ దుకాణంలో బగ్గా తలపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు సమీపంలో నుంచి కాల్పులు జరిపారు. ఆయనను ఒక స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆయన అప్పటికే మరణించినట్లు ఆసుపత్రిలో తెలిపారు.

డిఎస్‌పి అజయ్ కుమార్ నాయకత్వంలో భారీగా పోలీస్ బృందం, ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆ ప్రదేశానికి చేరుకున్నాయి. బగ్గా హత్యకు దేశవాళీ తుపాకీని ఉపయోగించినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలిందని డిఎస్‌పి కుమార్ చెప్పారు. కాగా, పోలీసులు కేసులో వర్యాప్తు ప్రారంభించారని, హత్యకు కారణంపై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని రోపార్ ఎస్‌ఎస్‌పి గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News