Sunday, December 22, 2024

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును సత్కరించిన విహెచ్‌పి నేతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు విశ్వహిందూ పరిషత్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు వరించిన శుభ సందర్భంగా విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం భాగ్యనగర్ లోని వెంకయ్య నాయుడు ఇంటికి వెళ్లి ఘనంగా సత్కరించి విశ్వహిందూ పరిషత్ సాహిత్యం అందజేశారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు పుస్తకాలు సంతోషంగా అందుకొని విశ్వహిందూ పరిషత్ ను అభినందించారు. పుస్తకాలను పరిశీలించి అందులో ఉన్నవారిని గుర్తించి వారి వివరాలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు జగదీశ్వర్, డాక్టర్ రాంసింగ్, రాష్ట్ర సహకార్యదర్శి భాను ప్రసాద్ , రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, దుర్గా వాహిని రాష్ట్ర సంయోజక్ వాణి సక్కుబాయి, పూర్వ ఎబివిపి కార్యకర్త మధు పాల్గొన్ని వెంకయ్య నాయుడు దేశానికి అందించిన సేవలు ప్రశంసించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News