Monday, December 23, 2024

మహిళల ఐపిఎల్.. వైకొమ్‌కు మీడియా హక్కులు

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్లూఐపిఎల్) మీడియా హక్కులను వైకొమ్ 18 మీడియా సంస్థ సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్ల కాలానికి సంబంధించి వైకొమ్ సంస్థ మీడియా హక్కులను దక్కించుకుంది.

దీని కోసం వైకొమ్ 18 సంస్థ రూ.951 కోట్లను చెల్లించేందుకు అంగీకరించింది. ఒక మ్యాచ్‌కు దాదాపు రూ.7.09 కోట్లను బిసిసిఐకి వైకొమ్ చెల్లించనుంది. ఈ ఒప్పందం 2023-27 వరకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జైషా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News