- Advertisement -
న్యూఢిల్లీ: భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆస్వస్థతకు గురయ్యారు. 73 సంవత్సరాల ధన్కర్ ఆదివారం ఉదయం ఛాతి నొప్పితో భాదపడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో తెల్లవారుఝామున 2 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన్ను క్రిటికల్ కేర్ యూనిట్‌లో అడ్మిట్ చేశారు. కార్టియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ వారంగ్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఆనారోగ్యానికి గురయ్యారని తెలిసిన వెంటనే బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.
- Advertisement -