న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(73)కు ఆదివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్(సిసియూ)లో చేరారు. ఆయనకు ఎయిమ్స్ కార్డియాలజీ విభాగధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధర్యంలో చికిత అందిస్తున్నారు. ప్రస్తుతం జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ డాక్టర్ల ఆబ్జర్వేషన్‌లో ఉన్నారు. ఇదిలావుండగా ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆ తర్వాత తన ‘ఎక్స్’ పోస్టులో ‘ఎయిమ్స్‌కు వెళ్లి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా సైతం ఎయిమ్స్‌కు వెళ్లి ధన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
అస్వస్థతతో ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -