Monday, December 23, 2024

చిదంబరం వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్,   పి. చిదంబరం పేరెత్తకుండానే ఓ కాంగ్రెస్ నాయకుడు మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై చేసిన వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని అన్నారు. రాజ్యసభ సభ్యుడు మూడు కొత్త క్రిమినల్ చట్టాలను ‘పార్ట్-టైమర్స్’ రూపొందించారని అనడం, పార్లమెంటు యోచననే అవమానించేదిగా ఉందని ధన్ఖర్ తెలిపారు.

కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జులై 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టాలు ‘నాన్-ప్రొఫెషనల్ వాళ్లు’ రూపొందించిందని అన్నారు. పైగా వారు ‘కమిటీ పార్ట్-టైమర్స్ సభ్యులు’ అని వ్యాఖ్యానించారు.

తిరువనంతపురంలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ (ఐఐఎస్‌టి) 12వ స్నాతకోత్సవంలో ధన్ఖర్ ప్రసంగిస్తూ,  డిసెంబర్ 2023లో పార్లమెంట్ ఆమోదించిన మూడు బిల్లులపై చర్చలో పాల్గొననందుకు చిదంబరం పేరు చెప్పకుండానే ఆయనపై విరుచుకుపడ్డారు.

భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత  2023,  భారతీయ సాక్ష్యా అధినియం 2023 లు భారతీయ శిక్షాస్మృతి 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్  1973, మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1972 స్థానంలో కొత్తగా వచ్చాయి.

చిదంబరం వ్యాఖ్యలపై స్పందించిన ధన్ఖర్ ‘‘నేను మాటల్లో చెప్పలేనంతగా షాక్ అయ్యాను, అందువల్ల, ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా, కథనం ద్వారా మన దేశాన్ని కించపరిచే, మన సంస్థలను కించపరిచే, మన పురోగతిని కించపరిచే, గోడపై రాత చూడని మనస్సుల పట్ల దయచేసి జాగ్రత్త వహించండి… విమర్శల కోసమే విమర్శలకు దిగుతున్నారు. ఇలాంటి కథనాలను ఖండిస్తున్నట్లు చెప్పడానికి నా దగ్గర పదాలు లేవు ” అని ధన్ఖర్ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News