Monday, December 23, 2024

సజీవ దహనానికి ముందు వారిని తీవ్రంగా కొట్టారు..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ లోని బీర్‌భూం జిల్లాలో చోటు చేసుకున్న సజీవ దహనాల ఘటన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఇళ్లకు నిప్పంటించే ముందు వారిని తీవ్రంగా కొట్టినట్టు తాజాగా పోస్ట్‌మార్ట్‌ం నివేదికలో తేలింది. రామ్‌పుర్‌హాట్ పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై 8 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలకు రామ్‌పుర్‌హాట్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. వీరి శవాలపై తీవ్ర గాయాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

సజీవ దహనానికి ముందు వీరిని అత్యంత తీవ్రంగా కొట్టినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. గత సోమవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్ భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే భోగ్‌టూయి గ్రామంలో హింస చెలరేగింది. భాదు షేక్ హత్యకు ప్రతీకారంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Victims badly beaten before burnt alive in Birbhum

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News