Friday, January 10, 2025

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరగాలి

- Advertisement -
- Advertisement -
  • ఎస్‌పి రమణకుమార్

సంగారెడ్డి: ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీస్ రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్‌పి రమణకుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో ఛార్జీ షీట్ ఫైల్ చేయాలన్నారు. పోలీస్ రెవెన్యూ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. భాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్థిక సాయాన్ని త్వరితగతిన ఇచ్చేలా చూడాలని డిఆర్‌ఓకు సూచించారు.

అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల దర్యాప్తు వేగవంతం అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని డిఎస్‌పిలకు సూచించారు. కమిటీ సభ్యులకు క్రియాశీలక పాత్ర పోషించాలని క్షేత్ర స్థాయిలో అట్రాసిటీ అంశాలతో ముడిపడి ఉన్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి నెల తప్పనిసరిగా సివిల్ రైట్స్‌డే నిర్వహించేలా చూడాలని రెవెన్యూ డివిజనల్ అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులలో లాంగ్ పెండింగ్ ఏమి లేవన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటునమన్నారు. చనిపోయిన కేసులలో ప్రాధన్యతగా ముందుగా పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2021/22 సంవత్సరంలో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులకు సంబంధించి 46 కేసుల్లో బాధితులకు 59.84 లక్షలు మంజూరు చేసి చెల్లించినట్లు తెలిపారు.

2022/23 సంవత్సరానికి 62కేసులకు సంబంధించి 68లక్షలు చెల్లించాల్సి ఉందని, నిధులు వచ్చిన వెంటనే బాధితులకు చెల్లించడం జరుగుతుందన్నారు. సమావేశంలో విజిలెన్స్ కమిటీ సభ్యులు చెప్పిన సమస్యలపై దృష్టి సారించి విచారణ జరిపి పరిష్కరించాలని రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులకు సూచించారు. ప్రతి నెల 30న అన్ని గ్రామాల్లో పౌర హక్కుల దినాన్నీ జరపాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిడి అఖిలేష్‌రెడ్డి, బిసి సంక్షేమ అధికారి జగదీష్, డిఎస్‌పి రవీంద్రారెడ్డి, ఆర్‌డిఓ రవీందర్‌రెడ్డి, డిటిడబ్లు ఫిరంగి ఎస్‌సి కార్పోరేషన్ ఈడీ రామాచారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఇమ్మయ్య, బి, రామకృష్ణ, దుర్గాప్రసాద్, చంద్రశేఖర్, రాథోడ్, నరసింహులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News