Monday, January 27, 2025

బాధితురాలి తల్లిదండ్రులు రాజకీయాలు చేస్తున్నారు: పశ్చిమ బెంగాల్ మంత్రి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అపఖ్యాతిపాలు చేస్తున్నారు

కోల్‌కతా: ఆర్జీ కర్ ఆసుపత్రి బాధితురాలి తల్లిదండ్రులు రాజకీయాలు చేస్తున్నారని, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అపఖ్యాతిపాలు చేయడానికి కుట్రలు చేస్తున్నారు’ అని పశ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం ఆదివారం ఆరోపించారు. దీనికి ఒక రోజు ముందు కాంగ్రెస్ నాయకుడు కునాల్ ఘోష్ సైతం ‘మమతా బెనర్జీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా కొన్ని కుట్రలు పన్నుతున్నాయని, మమతా బెనర్జీని అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్నాయి’ అని ఆరోపించారు. హకీం కూడా లేటెస్టుగా ఖండనకు దిగారు. ‘ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికయ్యారు. ఇతరుల మాదిరి బాధాతప్తులైన ఆర్జీ కర్ హాస్పిటల్ బాధితురాలి తల్లిదండ్రులను పావులుగా ఉపయోగించుకుని కాదు’అన్నారు.

కోల్‌కతా పోలీసుల నుంచి కేసును తమ చేతిలోకి తీసుకున్న సిబిఐ కేసును విచారించిందన్నారు. హకీం కోల్‌కతా మేయర్ కూడా. కొందరి స్వార్థపర శక్తుల చేతిలో పావులుగా మారిన ఆర్జీ కర్ హాస్పిటల్ బాధితురాలి తల్లిదండ్రులు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాధితురాలి తల్లి శుక్రవారం బెంగాలీ టివి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ‘కోల్‌కతా పోలీసులు, హాస్పిటల్ పాలకవర్గం, టిఎంసికి చెందిన ప్రజాప్రతినిధులు…ప్రతి ఒక్కరూ ఘోర ఘటనను నొక్కివేసేందుకు, నిజం వెలుగు చూడకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అన్నారు. 2024 ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికో అర్ధ నగ్నంగా విగతజీవి అయి లభించింది. కాగా విచారణ కోర్టు జనవరి 20న ఏకైక దోషి సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News