Friday, November 22, 2024

మద్రాస్ హైకోర్టు జడ్జీగా విక్టోరియా గౌరి!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి మద్రాస్ హైకోర్టు జడ్జీగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ వేసిన దాఖలైన వినతిని స్వీకరించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ‘మేము రిట్ పిటిషన్‌ను స్వీకరించడంలేదు. కారణాలు అనుసరిస్తాయి’ అని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. వినతిని వినడానికి ప్రత్యేక ధర్మాసనం ఉదయం 10.25 గంటలకు సమావేశమైంది. కాగా మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జీగా గౌరి ప్రమాణస్వీకారం చేసింది.

గౌరి నియామకాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయవాదులు పిటిషన్లను వేశారు. దానిని ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాస్తవానికి విచారణ ఫిబ్రవరి 10న జరుగాల్సి ఉండగా ఫిబ్రవరి 7కే చేపట్టారు. సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ ఆమె నియామకాన్ని కేంద్రం ప్రకటించిందని తెలుపడంతో అలా చేసింది. పిటిషనర్ లాయర్లయిన అన్నా మాథ్యూ, సుధా రామలింగం, డి. నాగశైల తమ పిటిషన్‌లో గౌరి ముస్లింలకు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేసిందని పేర్కొన్నారు. హైకోర్టు జడ్జీగా ఆమె ప్రమాణస్వీకారం చేపట్టకుండా తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేయాలని వారు ధర్మాసనానికి విన్నవించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News