Sunday, January 12, 2025

మెట్రో కారిడార్లు, స్టేషన్లలో ప్రజాపాలన, విజయోత్సవాల సంరంభం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ తల్లికి ఘన నీరాజనం
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజాపాలన, – ప్రజా విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంతో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనా చిత్రాన్ని రద్దీ ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్లలో ప్రదర్శించింది. ’జయ జయహే తెలంగాణ – జననీ జయకేతనం’ అంటూ తెలంగాణ స్ఫూర్తిని అంది పుచ్చుకుంటూ హైదరాబాద్ మెట్రో రైల్ మొత్తం 25 మెట్రో స్టేషన్లలో కొత్తగా రూపొందించిన ’తెలంగాణ తల్లి’ చిత్రాలను ఏర్పాటు చేసినట్టు హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు.

ప్రజాపాలన విజయోత్సవాలను హైదరాబాద్ మెట్రో స్టేషన్ల పరిథిలో జోరుగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. మెట్రో రైల్ రెండవ దశ ముఖ్యాంశాలను తెలిపేలా స్టేషన్‌ల కాన్ కోర్స్ లు, ప్లాట్ ఫామ్ లపై స్టాండీలను ఏర్పాటు చేశామని, ప్రధాన మార్గాలలో మెట్రో పిల్లర్లకు హోర్డింగ్ లను ఏర్పాటు చేసి ఈ సంవత్సరం ప్రభుత్వ విజయాలను, మెట్రో సాధిస్తున్న ప్రగతిని వివరించామని ఎన్‌విఎస్ రెడ్డి వెల్లడించారు. అందమైన విద్యుద్దీపాల అలంకరణతో ముఖ్యమైన మెట్రో మార్గాలు ప్రజలను విశేషంగా అలరిస్తున్నాయి. సంవత్సర పాలన విజయాలను ఘనంగా ప్రతిబింబించేలా హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ, నేను సైతం అంటూ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News