ఢిల్లీ: న్యాయం, ధర్మం కోసం 20 ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించామనిఎంఆర్‌పిఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ సంతోషం వ్యక్తం చేశారు. ఎస్‌సి వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ కోసం ఎంఆర్‌పిఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. మా జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఎంఆర్‌పిఎస్ పోరాటం చేసిందని, 30 ఏళ్ల పోరాటంలో ఎంతోమంది ఎంఆర్‌పిఎస్ నేతలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉద్యమంలో ప్రాణాలర్పించిన ఎంఆర్‌పిఎస్ నేతలకు ఈ విజయం అంకితమని, అనుకూల తీర్పునిచ్చిన జడ్జిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రక్రియ వేగవంతానికి చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అని చెప్పారు. గతంలో ఉమ్మడి ఎంపిలో ఎస్‌సి వర్గీకరణ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని, ఎపిలో చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండడంతో వర్గీకరణ అమలు జరుగుతోందని, ఎస్‌సి వర్గీకరణ చేసిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు వచ్చేవి కాదన్నారు. న్యాయం బతికిందంటే ఆ రోజు చంద్రబాబు తీసుకొచ్చిన చట్టం వల్లే అని మంద కృష్ణ మాదిగ చెప్పారు. అధర్మమే తాత్కాలికమైనదని, ధర్మమే గెలుస్తుందని ఆనాడే చెప్పానని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్ 5న చెప్పానని గుర్తు చేశారు.
ప్రాణాలర్పించిన ఎంఆర్‌పిఎస్ నేతలకు ఈ విజయం అంకితం: మంద కృష్ణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -