Thursday, December 12, 2024

స్టైలిష్ అవతార్‌లో విక్టరీ వెంకటేష్

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ’సంక్రాంతికి వస్తున్నాం’. ఇది వారి సక్సెస్‌ఫుల్ కలయికలో హ్యాట్రిక్ మూవీ. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మేకర్స్ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వెంకటేష్ డైనమిక్ అండ్ స్టైలిష్ అవతార్‌లో కనిపించిన ఈ బ్రాండ్ న్యూ పోస్టర్ అదిరిపోయింది.

వెంకటేష్ బర్త్ డే సందర్భంగా శుక్రవారం ’సంక్రాంతికి వస్తున్నాం’ సెకండ్ సింగిల్ ప్రోమోని అభిమానులకు కానుకగా ఇవ్వబోతోంది టీం. ఈ ట్రయాంగిల్ క్రైమ్ కథలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News