Sunday, January 19, 2025

వైఎస్ఆర్ సిపి అన్ని సీట్లను స్వీప్ చేస్తుంది: విడదల రజిని

- Advertisement -
- Advertisement -

విజయవాడ: వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ సి  పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా స్వీప్ సాధిస్తుందని  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో  మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా మెజారిటీ సాధించాలంటే ఏ పార్టీ అయినా 88 సీట్లు గెలవాల్సి ఉంటుంది. కాగా కౌంటింగ్ జూన్ 4న జరుగనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోక్ సభ 25 సీట్లకు కూడా మే 13ననే పోలింగ్ జరుగనున్నది. వీటి లెక్కింపు కూడా జూన్ 4 జరుగనున్నాయి.

విడదల రజనీ గుంటూరులో ‘గడపగడపకు’ పేరిట 35 డివిజన్లలో ఇంటింటికి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తాను 2019 మేనిఫెస్టో లో ఇచ్చిన వాగ్దానాలను 99 శాతం మేరకు నెరవేర్చారని ఆమె శ్లాఘించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలలో మార్పులు తెచ్చారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గతంలో వెల్లడించిన మేనిఫెస్టోను పట్టించుకోలేదని, వాగ్దానాలు నెరవేర్చలేదని విమర్శించారు. పైగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డియే తమకు సరైన నాయకుడన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని విడదల రజనీ కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News