ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్ పోరులో విదర్భ టీమ్ పైచేయి సాధించింది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ ధ్రువ్ షోరే (74), డానిష్ మలెవర్ (79), కరుణ్ నాయర్ (45), యశ్ రాథోడ్ (54), కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (34) పరుగులు చేశారు. ప్రత్యర్థి టీమ్ బౌలర్లలో శివమ్ దూబు ఐదు, షమ్స్ ములాని, రాయ్‌స్టోన్ డియాస్‌లు రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ముంబై బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 59 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ 67 (బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మిగతా వారిలో సిద్ధేశ్ లడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37) మాత్రమే కాస్త రాణించారు. విదర్భ బౌలర్లలో పార్థ్ రెఖాడె మూడు, యశ్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే ముంబై మరో 195 పరుగులు చేయాలి.
విదర్భ పైచేయి
- Advertisement -
- Advertisement -
- Advertisement -