Sunday, January 19, 2025

అక్షయ్ శతకం… ఓటమి దిశగా విదర్భ

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో జరిగిన రంజీ మ్యాచ్ ఫైనల్‌లో విదర్భ 131 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 355 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్‌లో విదర్భ 183 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉంది. విదర్భ కెప్టెన్, కీపర్ అక్షయ్ వాడ్కర్ సెంచరీతో చెలరేగాడు. అక్షయ్ 102 పరుగులు చేసి తనూష్ కొటియన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో హర్ష దుబే(65), అదిత్య సర్వతే (02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విదర్భ బ్యాట్స్‌మెన్లలో అక్షయ్(102), కరుణ్ నాయర్ (74), హర్ష దుబే(65) అథర్వ టైడ్(32), అమన్ మోకడే(32), ధ్రువ్ షోరే(28) పరుగులు చేసి ఔటయ్యారు. ముంబయి బౌలర్లలో తనుష్ కొటియన్ మూడు వికెట్లు, ముషీర్ ఖాన్ రెండు వికెట్లు, షమ్సీ ములాన్, ధావల్ కులకర్ణి చెరో ఒక వికెట్ తీశారు.

ముంబయి ఫస్ట్ ఇన్నింగ్స్: 224
విదర్భ ఫస్ట్ ఇన్నింగ్స్: 105
ముంబయి సెకండ్ ఇన్నింగ్స్: 418

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News