Monday, December 23, 2024

వెహికిల్ ట్రాకింగ్ సిస్టంపై వీడియో కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: సింగరేణి డైరెక్టర్ (పా) ఎన్.బలరాం (ఐఆర్‌ఎస్), కార్పొరేట్ జిఎంలతో కలిసి సింగరేణిలో వెహికిల్ ట్రాకింగ్ సిస్టం కు సంబంధించి చేపట్టాల్సిన ప్రణాళికలపై అన్ని ఏరియాల జిఎంలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ఏరియాలలో నూతన పరిజ్ఞానంతో ప్రవేశపెట్టిన వెహికిల్ ట్రాకింగ్ సిస్టం యొక్క పని తీరు, మునుముందు చేపట్టాల్సిన టెక్నికల్ అభివృద్ధి పనుల గురించి చర్చించారు.

కంపెనీలో వెహికిల్ ట్రాకింగ్ సిస్టం ప్రవేశ పెట్టిన తరువాత ప్రతీ ఒక్క వెహికిల్ మూవ్‌మెంట్ ను ఆన్‌లైన్‌లో కెమరాల ద్వారా పరిశీలించడం జరుగుతుందని, దీని ద్వారా కోల్ లోడింగ్ నుంచి డంపింగ్ వరకు ఆ వెహికిల్ యొక్క మూవ్‌మెంట్ పరిశీలించడం జరుగుతుందన్నారు. ఆర్జీ 1 ఏరియాలో వెహికిల్ ట్రాకింగ్ సిస్టం చక్కగా పనిచేస్తుందని అన్నారు.

మునుముందు కూడా కంపెనీలో నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్జీ 1 ఇన్‌ఛార్జి జిఎం బానోతు సైదులు, జిఎం క్వాలిటీ ఆర్జీ రీజియన్ కెవి రావు, డిజిఎం క్వాలిటీ ఎన్.శ్రీధర్, వెహికిల్ ట్రాకింగ్ సిస్టం ఇన్‌ఛార్జి రాజేశ్వర్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News