Wednesday, December 25, 2024

రీల్స్ మోజులో పట్టపగలే అసభ్యకరంగా అమ్మాయిల ప్రవర్తన..(వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

రీల్స్ మోజులో అమ్మాయిలు అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తూ పబ్లిక్ గా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏం చేస్తున్నామో మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు యువతులు. ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు ఒకరికొకరు హోలీ రంగులు వేసుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి వీడియోనే మరొకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిన్న హోలీ వేడుకలో రంగులు పూసుకున్న ఇద్దరు యువతులు స్కూటీపై వెళ్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. అమ్మాయిలు ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఒక అబ్బాయి స్కూటర్‌ను నడుపుతుండగా ఇద్దరు అమ్మాయిలు అతని వెనుక సీటుపై ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. పట్టపగలు రోడ్డుపై అమ్మాయిలు గట్టిగా హత్తుకుంటూ అసభ్యకర హావభావాలతో ప్రవర్తించడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు నోయిడా పోలీసులకు ట్యాగ్ చేస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వీడియోలో ఉన్న ఇద్దరు అమ్మాయిలతోపాటు స్కూటీ నడుపుతున్న అబ్బాయికి రూ.33,000 జరిమానా విధించారు.

ఫిర్యాదుల మేరకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సంబంధిత వాహనంపై చర్యలు తీసుకోవడం జరిగిందని.. నిబంధనల ప్రకారం ఇ-చలాన్(జరిమానా రూ. 33000) జారీ చేశామని నోయిడా పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News