Friday, November 15, 2024

కెనడా ఖలీస్తానీ నిజ్జర్ హత్యోదంతం.. వెలుగులోకి వీడియో

- Advertisement -
- Advertisement -

టొరంటో: కెనడాలో ఖలీస్థానీ నేత ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోందతపు వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కెనాడాలోని సర్రేలోని ఓ గురుద్వారా వెలుపల తొమ్మిది నెలల క్రితంఆయన హత్యకు గురయ్యారు. బ్రిటిష్ కొలంబియా ప్రాంతపు సర్రేలో ఓ సాయుధుడు ఆయనపై అంతా చూస్తూ ఉండగానే కాల్పులకు దిగిన ఘట్టం ఇప్పుడు వీడియోరూపంలో వైరల్ అయింది. కెనడాలో నిజ్జర్ హత్యోదంతం కెనడా, భారతదేశాల నడుమ దౌత్య స్థాయి చిచ్చుకు దారితీసింది. 2023 జూన్ 12వ తేదీ సాయంత్రం ఈ హత్య జరిగింది. నిజ్జర్‌ను భారత ప్రభుత్వం 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఘటన వీడియోను సిబిసి న్యూస్ కెనడా దర్యాప్తు క్రమపు డాక్యుమెంటరీ సీరిస్ ద్వారా సేకరించింది.

ఆ రోజు జరిగిన ఘటన వివరాలన్ని ఈ వీడియోలో పొందుపర్చి ఉన్నాయి. గురుద్వారా వెలుపల పార్కింగ్ స్థలి నుంచి నిజ్జ్జర్ తన గోధుమ రంగు డోడ్జే రామ్ పికప్ వ్యాన్‌లో వెళ్లడం , దీనిని ఓ తెల్లటి సుడన్ కారు వెంబడించడం , నిజ్జార్ వాహనం ముందు వచ్చి నిలవడం , వెంటనే అందులో నుంచి ఇద్దరు కిందికి దిగి ఆయనపై కాల్పులు జరపడం, తరువాత సిల్వర్ టయోటా కామ్రి కారులో ఫరారు కావడం కన్పించింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న వారిద్దరు ఇప్పుడు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు అయ్యారు. కాల్పుల చప్పుడు వినబడగానే తాము పరుగులు తీసి వచ్చామని కారులోని దుండగులను పట్టుకునేందుకు యత్నించామని వీరు చెప్పారని సిబిసి తెలిపింది.

తరువాత కిందపడి స్పృహకోల్పోయి ఉన్న వ్యక్తిని రక్షించేందుకు చూశామని వివరించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించామని ప్రత్యక్ష సాక్షులలో ఒక్కరైన భూపీందర్ సింగ్ సిద్ధూ తెలిపారు. దుండగులను పట్టుకోలేకపొయ్యామని, బాధితుడు ప్రాణాలు వదిలాడని వివరించారు. నిజ్జ్జర్ హత్య వెనుక భారత ఇంటలిజెన్స్ సంస్థలు, ప్రత్యేకించి కొందరు ఇండియా ఏజెంట్లు ఉన్నారని, తమ భూభాగంలో ఓ కెనడా పౌరుడి వధను ఖండిస్తున్నామని, ఘటనకు భారత దేశం బాధ్యత వహించాలని కెనడా ప్రధాని ట్రూడో అప్పట్లో పేర్కొనడం , పరస్పర దౌత్య ఆంక్షలు తీవ్రస్థాయి వివాదానికి దారితీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News