Monday, January 20, 2025

రైల్వే ప్లాట్ ఫామ్‌పై ఉన్న టివిలో బ్లూ ఫిల్మ్ వీడియోలు… కంగుతున్న ప్రయాణికులు

- Advertisement -
- Advertisement -

పాట్నా: రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న టివిలో బ్లూ పిల్మ్ ప్రసారమైన సంఘటన బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… తానా జంక్షన్ లో రైళ్ల కోసం ప్రయాణికులు రైల్వే ఫ్లాట్ ఫామ్ నంబర్ 10 వద్ద ఎదురు చూస్తున్నారు. టివి స్క్రీన్‌లో ఏ రైలు ఎప్పుడు వస్తుందని వివరాలు కనిపిస్తున్నాయి. ఒక్క సారిగా బ్లూ ఫిల్మ్ రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు తలదించుకున్నారు. అశ్లీల వీడియోలు ప్రసారం అవుతుండడంతో ఆందోళన చెందారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో టివిని స్విఛ్ ఆఫ్ చేశారు. దత్తా కమ్యూనికేషన్ అనే సంస్థ ప్రసార బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం. దీనిపై ఆర్‌పిఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే శాఖ నిర్లక్ష్యానికి ఇది ఒకటి నిదర్శనం అని నెటిజన్లు మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News