Friday, January 10, 2025

చాలా ఫ్రెష్‌గా ఉండే కథ

- Advertisement -
- Advertisement -

రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ దర్శక ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘విధి’. రంజిత్ ఎస్ నిర్మించిన ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. నవంబర్ 3న రాబోతోన్న విధి మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ “మూవీ నిర్మాత రంజిత్ నాకు స్నేహితుడు.ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి” అని అన్నారు.

నిర్మాత రంజిత్ మాట్లాడుతూ.. ‘మా దర్శకులు, హీరో అద్భుతం చేశారు. వారి మొదటి సినిమాలా ఉండదు. సినిమాలోని కథ, కథనాన్ని ఎవ్వరూ ఊహించరు. అద్భుతంగా ఉంటుంది. కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది” అని తెలిపారు. డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మంచి కంటెంట్‌తో రాబోతోన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్, డైరెక్టర్ శ్రీనాథ్, హీరోహీరోయిన్లు రోహిత్ నందా, ఆనంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News