Monday, December 23, 2024

విద్యుత్ దార్శనికుడి పర్యటన విజయవంతం

- Advertisement -
- Advertisement -

పినపాక : మణుగూరు పినపాక మండలాల సరిహద్దు ప్రాంతంలో నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర జెన్‌కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈపర్యటనలో భాగంగా ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్ట్ హాస్టల్‌ను ప్రారంభించారు. కేపీసీ కాంప్లెక్స్ టౌన్ షిప్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో జెన్కో యంత్రాంగం ఎంతో కృషి చేస్తుందన్నారు.

ప్రజలకు 24గంటల విద్యుత్ అందించేందుకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. త్వరతగతిన రైల్వే నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క పని కూడా నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెన్కో శాఖ డైరెక్టర్లు, బిటిపిఎస్ చీఫ్ ఇంజినీర్ బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News