Sunday, November 17, 2024

నాగార్జున కొంద సందర్శించిన వియత్నాం మీడియా నిపుణులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : వియత్నాం నుండి వచ్చిన 26 మంది మీడియా ప్రొఫెషనల్స్ నాగార్జున కొందను సందర్శించారు. వీరు జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ పై హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు. ఈ ప్రతినిధి బృందం ఆదివారం దక్షిణ భారతదేశంలోని అత్యంత ధనిక బౌద్ధ అభ్యాస కేంద్రాలలో ఒకటిగా ఉన్న నాగార్జున కొండను సందర్శించింది. ఇండియన్ టెక్నికల్, ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటిఈసి) కార్యక్రమం కింద భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ శిక్షణా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది. మీడియా నిపుణులు ఎఎస్‌ఐ మ్యూజియాన్ని సందర్శించి బుద్ధ స్థూపాలు, సంబంధిత కథనాల సేకరణను చూసి మైమరచిపోయారు. బుద్ధుని విగ్రహానికి పూజలు చేశారు.

బుద్దవనం ప్రాజెక్టును కూడా మీడియా నిపుణులు సందర్శించారు. ప్రముఖ బౌద్ధ సన్యాసి, పండితుడు ఆచార్య నాగార్జునకు సంబంధించిన వీడియోలను వీక్షించారు. వారక్కడ ప్రార్థనలు చేసి, వారి వృత్తిపరమైన, వ్యక్తిగత శ్రేయస్సు కోసం ఆచార్య నాగార్జున ఆశీర్వాదం కోరారు. బుద్ధుడు, ఆచార్య నాగార్జున జన్మస్థలం గురించి వారి తల్లిదండ్రుల నుంచి విన్నామని మీడియా నిపుణులు పేర్కొన్నారు. ‘నాగార్జున కొండ, ఎఎస్‌ఐ మ్యూజియం, బుద్ధవనం ప్రాజెక్ట్‌లను సందర్శించడం అనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ ఐటిఈసి విభాగం, డైరెక్టర్ జనరల్, డాక్టర్ ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి ఇన్స్టిట్యూట్ ద్వారా మాకు జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అవకాశం‘ అని ఆ ప్రతినిధి బృందం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News