Sunday, January 19, 2025

సైబర్ నేరాలపై అప్రమత్తత కంపల్సరీ : డిజిపి అంజనీకుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలని, రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డిజిపి అంజనీ కుమార్ అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సైబర్ నేరాలపై సెమినార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సెమినార్ ద్వారా విద్యార్థులకు, పబ్లిక్ కి అవగాహన కల్పించామని తెలిపారు. సైబర్ నేరాలు అడ్డుకట్ట వేయడం ఛాలెంజింగ్‌గా మారిందన్నారు. సెమినార్ లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి సెమినార్లు నిర్వహించడం ద్వారా పబ్లిక్ లో మరింత అవగాహన వస్తుందన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. మీ ఫోన్లకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెస్సేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసే మోసాలకు గురి కావొద్దన్నారు. మీ పోన్ హ్యాక్ అయితే వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సరికొత్త మోసాలలో ఈ సైబర్ దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి వాటిని గమనించి వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News