Friday, November 22, 2024

రెండోరోజూ విజిలెన్స్ తనిఖీలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/జ్యోతినగర్: కాళేశ్వ రం ఎతిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారే జీ కుంగిన ఘటనలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం రెండో రోజు రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెంది న పలు కార్యాలయాలలో విజిలెన్స్ అధికార బృం దాలు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉద యం నుంచి రాత్రివరకూ సోదాలు జరిగాయి. కన్నెపల్లి , మేడిగడ్డ బ్యారేజిలకు చెందిన కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న రికార్డులు , కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను డివిజన్ కార్యాలయానికి తరలించారు. రాత్రి మేడిగడ్డ గెస్ట్‌హౌస్‌లోనే బస చేసిన విజిలెన్స్ ఆధికారులు బుధవారం ఉదయం తిరిగి మహదేవ్‌పూర్ నీ టి పారుదల శాఖ కార్యాలయాల్లో సోదాలు ప్రారంభించారు. మొత్తం పదిమంది అధికారులు ఈ తనిఖీ లో పాల్గొన్నారు.

విజిలెన్స్ బృందాల్లో ఇంజనీరింగ్, పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. ప్రాజెక్టు డిజైన్స్, మేడిగడ్డ బ్యారేజిపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల నివేదిక, పంప్‌హౌస్ గోడకూలటానికి దారి తీసిన పరిస్థితులు , పునరుద్దరణ పనులు, బిల్లుల చెల్లింపులు, వరద నీటి విడుదల తదితర అంశాలకు సంబంధించిన కీలక రికార్డులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జలసౌధలోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో ఈఎన్సీ ఆఫీస్‌తోపాటు ఇతర సెక్షన్లనుంచి , క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డులతోపాటు , రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర కార్యాలయానుంచి స్వాధీనం చేసుకున్న రికార్డులన్నింటినీ సీజ్ చేసి హైదరాబాద్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ కార్యాలయానికి తరలిస్తున్నారు.
ఎన్‌టిపిసిలో..
పెద్దపల్లి జిల్లా, రామగుండం ఎన్‌టిపిసిలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మూడు కార్యాలయాల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారుల బృందం రెండవ రోజు కూడా విచారణ కొనసాగింది. మేడిగడ్డకు సంబంధించిన నీటి పారుదల శాఖ కార్యాలయాలు ఎన్‌టిపిసిలో ఉన్న ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సి), సూపరిండెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం (ఎస్‌ఈ), క్వాలిటీ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం నుండి చేపట్టిన విజిలెన్స్ విచారణ బుధవారం సాయంత్రం వరకు కొనసాగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అతి కీలకమైన డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులతో పాటు ఇంజనీర్ల అధికారుల బృందం పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులపాటు జరిగిన విజిలెన్స్ విచారణ సందర్భంగా నీటి పారుదల కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News