- Advertisement -
హైదరాబాద్: సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. మంగళవారం వేకువజామున రాజీవ్‌కు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ఆయన అక్కడి చికిత్స పొందుతూ చనిపోయారు. 1991 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి రాజీవ్ రతన్, గత సంవత్సరం మహేందర్ రెడ్డి డిజిపిగా రిటైర్డ్ అయినప్పుడు రతన్ పేరు ప్రముఖంగా వినిపించింది. రతన్ మృతిపట్ల ఐపిఎస్ అధికారులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. పోలీస్‌గా ఉండి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. గతంలో ఆయన డిజి, కరీంనగర్ ఎస్‌పి సేవలందించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేసి మన్ననలు పొందారు. మేడిగడ్డ వ్యవహారంపై విచారణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
- Advertisement -