Monday, December 23, 2024

టియులో మరోసారి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు

- Advertisement -
- Advertisement -

టియులో మరోసారి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
డిచ్‌పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో మరోసారి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. ఈనెల 6న ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు చేసి పలు ఫైళ్లను పట్టుకెళ్లారు. మళ్లీ మరోమారు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ సభ్యులు ఆరుగురు అధికారుల బృందం తనిఖీలు చేశారు. ఇంజనీరింగ్ సెక్షన్, ఎగ్జామినేషన్ సెక్షన్, బిల్డింగ్ సెక్షన్, ఏఓ కార్యాలయంలో సోదాలు చేశారు. యూనివర్సిటీలో గత కొంతకాలంగా అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలతో ఫైళ్లను పరిశీలిస్తున్న ఇడి అధికారులు విధులకు హాజరుకాని విసి, రిజిస్ట్రార్ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసి కమిటీ ఫిర్యాదుతో సోదాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News