Monday, January 20, 2025

హెచ్‌ఎండిఎలో విజిలెన్స్‌ దాడులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: గత బిఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా విచారణ జరపేందుకు విజిలెన్స్‌ అధికారులను రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు పలు శాఖల్లో విచారణ ప్రారంభించింది. తాజాగా హెచ్‌ఎండీఏలో విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. గత ప్రభుత్వంలో హెచ్‌ఎండీఎ ఇచ్చిన అనుమతులపై విచారణ చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ఇచ్చిన అనుమతులపై ఆరా తీస్తున్నారు అధికారులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News