Monday, December 23, 2024

పాత నేరస్తులపై నిఘా పెంచాలి

- Advertisement -
- Advertisement -
  • ప్రతి పిటిషన్‌ను ఆన్‌లైన్లో నమోదు చేయాలి
  • 100 కాల్ వచ్చిన వెంటనే స్పందించాలి: ఎస్పి రోహిణి ప్రియదర్శిని

నర్సాపూర్: పాత నేరస్తులపై నిఘా పెంచాలని, 100 కాల్ వచ్చిన వెంటనే స్ప ందించాలని,నర్సాపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చే సిన సందర్బంగా, ఎస్పి పి.రోహిణి ప్రియదర్శిని, సిఐ, ఎస్‌ఐలకు సూచించారు. మంగళవారం ఎస్పి పి.రోహిణి ప్రియదర్శిని నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌ను,ఆకస్మిక తనిఖీ చేసి,పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తు న్న విధులను, ఎస్‌ఐ శివకుమార్ ఎస్పికి తెలియజేశారు. ఎస్పి అక్కడి అధికారులకు పలు సూచనలు చేస్తూ, ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉ ంచాలని, పోలీస్‌స్టేషన్‌లోని వర్టికల్స్ నిర్వహణ, హెచ్‌ఆర్‌ఎంఎస్ ఆన్ లైన్ వినియోగించు విధానం, టిఎస్ సిఓపిఎస్ ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు, విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పిటిషన్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహ న కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పె ట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే స్పందించి, సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా పెట్టాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉండకుండా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి వివరించి, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఉండేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ .షేక్ లాల్ మదర్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News