Monday, December 23, 2024

వైభవంగా ‘విహారి ది ట్రావెలర్’ పుస్తక ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

ట్రావెలింగ్ ప్రోగ్రామ్స్ లో సరికొత్త అధ్యయాన్ని సృష్టించిన ప్రోగ్రామ్ విహారి. గత 18 ఏళ్లుగా ఎక్కడా బ్రేక్ లేకుండా విజయవంతంగా టెలివిజన్ లో ప్రదర్శింపపడిన విహారి ది ట్రావెలర్ ప్రోగ్రామ్ త్వరలో మరో సరికొత్త ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. మరో సరికొత్త ప్రోగ్రామ్ లో సెలబ్రిటీస్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రముఖ ఓటిటి లో ఈ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. వాటి వివరాలు త్వరలో డైరెక్టర్ ఏ.ఎల్. నితిన్ కుమార్ తెలియజేయనున్నారు. 18ఏళ్ళు విహారి ప్రోగ్రామ్ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడిన కారణంగా విహారి ద ట్రావెలర్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ డైరెక్టర్ ఏ.ఎల్.నితిన్ కుమార్, యాంకర్ కరుణ, సదరన్ ట్రావెల్స్ ఎండి. ప్రవీణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఏ.ఎల్.నితిన్ కుమార్ మాట్లాడుతూ… మా విహారి ప్రోగ్రామ్ ను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ప్రోగ్రామ్ ను టెలివిజన్ తో పాటు యూట్యూబ్ ఛానెల్ లో లో కూడా అనేక మంది ప్రేక్షకులు వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మా ప్రోగ్రామ్ ద్వార అనేక దేశాలను ప్రేక్షకులకు పరిచయం చేశాం. త్వరలో మరో కొత్త ప్రోగ్రామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. ఇప్పుడు ఆవిష్కరించిన విహారి ది ట్రావెలర్ పుస్తకంలో చాలా షాట్ గా భారత దేశంలో మనం చూడ్డానికి అందమైన ప్రదేశాలను పొందుపడచడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ the traveller వెబ్ ఛానల్ లో చూడవచ్చు అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News