Wednesday, January 22, 2025

మోస్ట్ ప్రామిసింగ్‌గా విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు-2’ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీతో తెలుగులోనూ తిరుగులేని మార్కెట్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించినప్పుడు తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మధ్య విడుదలైన పాటలు ఆ హైప్ ను మరింత పెంచాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కనిపిస్తోంది. కంప్లీట్ కమర్షియల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంత ఆసక్తికంగా కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా విజయ్ ఆంటోనీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఫస్ట్ పార్ట్ లో ఒక్కడే రెండు భిన్నమైన నేపథ్యాల్లో కనిపించాడు. ఈ సారి ఇద్దరులా కనిపిస్తూ ఆడియన్స్ లో ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ఇంతకుముందు, సోషల్ మీడియాలో ‘యాంటీ-బిక్లి’ అనే కొత్త పదాన్ని ఉపయోగించి 4 నిమిషాల టీజర్, థీమ్ సాంగ్ ను విడుదల చేస్తూ సినిమా థీమ్ ను తెలియజేశాడు విజయ్. ‘బిక్లి’ అంటే పేదవారిని ఆర్థికంగా దోపిడీ చేసే అత్యాశపరుడు అని అర్థం. అయితే బిచ్చగాడు2లో విజయ్ ఆంటోని యాంటీ బికిలీగా కనిపించబోతున్నాడు.

ఇక ట్రైలర్ చూస్తే భారతదేశంలోనే 7వ అత్యంత సంపన్నుడైన విజయ్ గురుమూర్తిగా విజయ్ ఆంటోనీ కనిపిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ అన్నీ అదిరిపోయాయి. ఓ రేంజ్ లో పరిచయమైన విజయ్ తర్వాత విమాన ప్రమాదానికి గురవుతాడు. అందుకు కారణం యాంటీ బికిలీ అంటూ మళ్లీ విజయ్ ఆంటోనీనే పరిచయం చేయడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. విజయ్ గురుమూర్తి మరణానికి సంబంధించిన సన్నివేశాలు.. యాంటీ బికిలీ ఎంట్రీ, కోర్ట్ డ్రామా ఇవన్నీ భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.

దీంతో పాటు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అన్నా చెల్లెల్ల ఎపిసోడ్ ప్రేక్షకుల హృదయాలను మరోసారి కట్టిపడేసేలా చూపించబోతున్నట్టు అర్థం అవుతోంది. సీక్వెల్ ట్రైలర్ చూస్తోంటే విజయ్ ఆంటోనీ మరోసారి బ్లాక్ బస్టర్ కంటెంట్ తోనే వస్తున్నట్టు కనిపిస్తోంది. విజయ్ ఆంటోనీ సరసన కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మే 19 న విడుదల చేయబోతున్నట్టు ట్రైలర్ లోనే అనౌన్స్ చేశారు. అంటే ఈ సమ్మర్ లో బిచ్చగాడు2తో ఆడియన్స్ మరో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్నారని చెప్పొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News