Monday, December 23, 2024

జూలై 21న విజయ్ ఆంటోని ‘హత్య’

- Advertisement -
- Advertisement -

బిచ్చగాడు-2 మూవీతో ఈ మధ్య సూపర్ హిట్ అందుకున్న తమిళ హీరో విజయ్ అంటోని.. మరో సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. సరికొత్త లైన్‌తో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కించిన హత్య సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్లు. ఈ సినిమాను తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను సురేష్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ సొంతం చేసుకుంది. ఈ రెండు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కలిసి హత్య సినిమాను జూలై 21న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.

రీసెంట్‌గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఎవరు నువ్వు? అంటూ సాగే లిరికల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలాజీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హత్య మూవీలో విజయ్ ఆంటోని కంప్లీట్ మేకోవర్‌తో.. సరికొత్త కొత్త లుక్‌లో కనిపించనున్నారు. లోటస్ పిక్చర్స్‌తో కలిసి ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ హత్య మూవీని నిర్మిస్తోంది. కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో మురళీ శర్మ, మీనాక్షి చౌదరి, జాన్ విజయ్, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ్ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆర్కే సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News