Saturday, December 28, 2024

‘బిచ్చగాడు 2’ షూటింగ్‌లో ప్రమాదం.. హీరో విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలు..

- Advertisement -
- Advertisement -

‘బిచ్చగాడు 2’ సినిమా షూటింగ్‌లో కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డాడు. 2016లో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బిచ్చగాడు’.. తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి సిక్వెల్ గా ‘బిచ్చగాడు 2’ను రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా బోటులో యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో హీరో విజయ్ గాయపడడంతో చిత్రయూనిట్ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News