Wednesday, January 22, 2025

కూతురితో పాటు చనిపోయాను: విజయ్ ఆంటోనీ

- Advertisement -
- Advertisement -

చెన్నై : కూతురు మీరా ఆత్మహత్యతో చనిపోయిన నాడే తానూ చనిపోయినట్లుగా భావించుకుంటున్నానని సినీ ప్రముఖుడు విజయ్ ఆంటోనీ స్పందించారు. ఈ మధ్యనే 16 సంవత్సరాల మీరా ఆంటోనీ ఉరేసుకుని చనిపోయింది. రెండు మూడు రోజలు మౌనం తరువాత ట్విట్టర్ ద్వారా విజయ్ తమ భావోద్వేగం వ్యక్తపర్చారు.“ కూతురు మీరా చనిపోయింది. అప్పటి నుంచే నేనూ చనిపోయినట్లే. ఇకపై తాను చేసే ప్రతి మంచి పనిని ఆమె పేరిటే చేస్తాను. ఈ విధంగా కలకాలం ఆమెతో కలిసి ఉంటాను. దయగల ధైర్యవంతురాలైన కూతురు. ఇప్పుడు చెప్పాపెట్టకుండా ఈర్షాద్వేషాలు అసూయలు లేని ప్రశాంత వాతావరణంలోకి వెళ్లింది. ఆమె నన్ను వీడిపోలేదు. నా పెద్ద కూతురు ఎప్పుడూ నా వెంటనే ఉంటుంది” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News