Monday, December 23, 2024

1923లో జరిగిన ఘటన ఆధారంగా…

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా కోలీవుడ్ హీరో విజయ్ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో దర్శకుడు బాలాజీ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం లో రితికా సింగ్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. లోటస్ పిక్చర్స్, ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్స్‌పై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఈ నెల 21న గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది. ఈ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో దర్శకుడు బాలాజీ కుమార్ మాట్లాడుతూ.. “1923లో జరిగిన ఓ ఘటన ఆధారంగా హత్య చిత్రాన్ని రూపొందించాను. ఒక మంచి థ్రిల్లర్ మూవీగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది”అని అన్నారు.హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ “దర్శకుడు బాలాజీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటే హాలీవుడ్ డిటెక్టివ్ మూవీస్ గుర్తొస్తాయి. గిరిష్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి చౌదరి, జి. ధనుంజయన్, గిరీష్ గోపాలకృష్ణన్, సిద్ధార్థ్ శంకర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News