Wednesday, January 22, 2025

18న టైటిల్ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా వీడీ 13. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ చిత్రమిది. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా నుంచి మేకర్స్ కొత్త అప్ డేట్ వెల్లడించారు. ఈ నెల 18న సాయంత్రం 6.30 నిమిషాలకు వీడీ 13 సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎస్వీసీ ప్రకటించింది. చిన్న టీజర్ ద్వారా ఈ సినిమా టైటిల్ వెల్లడించనున్నారు. ప్రస్తుతం వీడీ 13 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతి పండుగకు ప్రపంచ వాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News