Monday, January 27, 2025

మరోసారి దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఫోటో వైరల్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన జంట మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. వీరిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సోసల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరు డేటింగ్‌లో ఉన్నట్లు పలుసార్లు నెటిజన్స్ ఫోటోలు వైరల్ చేశారు. ఫారెన్ ట్రిప్ లో ఒకే లొకేషన్ దిగిన పోటోలను జత చేస్తూ వీరిద్దరూ కలిసే వెళ్లారంటూ ప్రచారం జరిగింది.

అంతేకాదు దీపావళి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ను రష్మిక, విజయ్ ఇంట్లోనే చేసుకుందని.. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సైతం వైరల్ చేశారు. దీనికి తోడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ తాను సింగిల్ కాదని, ఓ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నానని హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో విజయ్, రష్మిక కెమెరాకు చిక్కారు. ఒక రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి కూర్చున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉంటున్నది నిజమేనని.. త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News