తన సంపాదన నుంచి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు కోటి రూపాయలు గిఫ్ట్ ఇస్తానని రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రకటించారు. విజయ్, సమంత కలిసి నటించిన ఖుషి మూవీ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుసోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సోమవారం రాత్రి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..
“ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తోంది. ఈ విజయానికి కారణం మీరే. మూడు రోజుల్నించి చూస్తున్నా మీ మొహల్లో సంతోషం చూసి నాకు చాలా తృప్తిగా ఉంది. ఖుషి ఒక సింపుల్, క్యూట్ ఎమోషనల్ లవ్ స్టోరి. సినిమా చేసేప్పుడు శివ కూడా ఇదే మాట చెప్పాడు. విజయ్ బ్రో మనం ఒక క్యూట్ లవ్ స్టోరిని ఒక మంచి పాయింట్ చెబుతూ ఫ్యామిలీస్ హాయిగా చూసేలా చేద్దామని అనేవాడు. ఇవాళ సినిమాకు మీరు అందిస్తున్న ప్రేమ చూస్తుంటే కృతజ్ఞతగా మీకు మేము చాలా చాలా చేయాలని అనిపిస్తోంది. నేను డబ్బు సంపాదించాలి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి, సమాజంలో గౌరవంగా బతకాలి అనేది మాత్రమే ఆలోచించేవాడిని. ఇవాళ ఖుషికి మీరిస్తున్న ఆదరణ చూస్తుంటే నేనొక మంచి సినిమా చేస్తే చూసేందుకు మీరంతా ఎదురుచూస్తున్నారని అర్థమైంది. నేను గెలవాలని, నా సినిమాలు విజయం సాధించాలని మీరంతా కోరుకుంటున్నారు. నా సినిమాలు ఫ్లాపైతే బాధపడుతున్నారు, నా సినిమా హిట్ అయితే సంతోషిస్తున్నారు.ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా.
ఇప్పటి నుంచి నేను నా ఫ్యామిలీతో పాటు హండ్రెడ్ పర్సెంట్ మీ కోసం కూడా పనిచేస్తా. మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఖుషిని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. మీ నవ్వులు చూద్దామని అనుకున్నా చూస్తున్నా. కానీ తృప్తి లేదు. కానీ ఏదో చేయాలని ఉంది. పర్సనల్ గా మీ అందరినీ కలవలేను. మీరు ఖుషిగా ఉన్నారు నేను ఖుషిగా ఉన్నా. నా ఖుషి మీతో పంచుకునేందుకు నా ఖుషి సంపాదన నుంచి కోటి రూపాయలు నా ఫ్యామిలీ అయిన మీకు ఇస్తున్నా. త్వరలో వంద ఫ్యామిలీస్ ను సెలెక్ట్ చేసి ప్రతి ఫ్యామిలీకి లక్ష రూపాయల చెక్ నేను అందిస్తా. నా సోషల్ మీడియాలో స్ప్రెడింగ్ ఖుషి అని ఒక ఫామ్ పెడతా. నేనిచ్చే మనీ మీకు రెంట్స్, ఫీజు దేనికి హెల్ప్ అయినా నాకు సంతోషం. నా హ్యాపీనెస్ లాగే నా సంపాదన కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరంతా దేవర ఫ్యామిలీ” అని పేర్కొన్నారు.