‘అర్జున్ రెడ్డి’ సినిమా సక్సెస్‌తో యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియాలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక్క తెలుగులోనే రిలీజ్ అయినా వివిధ భాషల్లో ఈ మూవీ రీమేక్ కావడం విజయ్‌కి కలిసొచ్చింది. ఆ ఒక్క హిట్ బాలీవుడ్‌లో అనూహ్యమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. సరిగ్గా ఇదే ఇమేజ్‌ని వాడుకునేందుకు పూరి జగన్నాథ్ రంగంలోకి దిగి ‘లైగర్’ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
అలా విజయ్ తొలి బాలీవుడ్ చిత్రంతో హిందీలో లాంచ్ అవుతున్నాడు. పూరికి బాలీవుడ్‌లో కొద్దో గొప్ప ఇమేజ్ ఉంది. అమితాబచ్చన్‌తో తెరకెక్కించిన బుడ్డా హోగా తేరా బాప్, బిసినెస్‌మెన్ లాంటి చిత్రాలతో పూరికి ఉత్తారిదిన ఓ ఇమేజ్ ఏర్పడింది. యశ్ రాజ్ ఫిలింస్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున థియేటర్లు దొరికే అవకాశం ఉంది. ‘లైగర్’ సక్సెస్ అయితే కనుక ఆ ప్రభావం విజయ్ తదుపరి చిత్రాలపై ఉంటుంది. ఈనేపథ్యంలో శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈసినిమా సెట్స్‌కు వెళ్లనుంది.
ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కియారా అద్వానీని ఎంపిక చేశారు. తొలుత చిత్రాన్ని కేవలం తెలుగులోనే తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. కానీ తాజాగా పాన్ ఇంటియా కేటగిరిలోనే ఈ సినిమాను తెరకెక్కించాలని ఫిల్మ్‌మేకర్స్ భావిస్తున్నారట. తెలుగుతో పాటుఏక కాలంలో హిందీలో కూడా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని సన్నాహాకాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కియారాకి భారీగా పారితోషికం ఆఫర్ చేసి ప్రాజెక్ట్‌లోకి దించినట్లు టాక్. అయితే శివ ఎంపిక చేసుకున్న స్క్రిప్ట్ ఎలాంటింది? అన్నది తెలియాల్సి ఉంది.