Thursday, December 19, 2024

పీరియడ్ చిత్రంలో పోలీస్‌గా…

- Advertisement -
- Advertisement -

హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. అది పూర్తయ్యాక వెంటనే మరో సినిమాను ప్రారంభించనున్నాడు విజయ్ దేవరకొండ. ఈ కొత్త సినిమా పీరియడ్ మూవీ. కొన్ని ఏళ్ల క్రితం జరిగిన కథ అన్నమాట. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాతో మంచి హిట్ అందుకోగలను అని నమ్ముతున్నాడు ఈ యంగ్ హీరో. ఫ్యామిలీ చిత్రాలతో కొంత ఊపిరి పీల్చుకునేలా పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇక ఇప్పుడు కొంచెం వైవిధ్యమైన చిత్రాలు చేయాలనుకుంటున్నాడు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీసే పీరియడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ పోలీస్‌గా నటిస్తున్నాడు. కెరీర్ లో మొదటిసారి ఖాకీ దుస్తుల్లో కనిపిస్తాడు. పూర్తిగా కొత్త లుక్, కథ, కథనాలు కూడా ఫ్రెష్ గా ఉంటాయట. ఆ దర్శకుడు ఇంతకుముందు తీసిన జెర్సీ మూవీలా ఇది కూడా కొత్త అనుభూతిని మిగులుస్తుంది. ఈ సినిమాను చాలా భాగం శ్రీలంకలో తీయనున్నారు. జూన్ నుంచి శ్రీలంకలో చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాని కూడా ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News