Monday, December 23, 2024

నా సర్వస్వం తీసుకున్న సినిమా ఇది

- Advertisement -
- Advertisement -

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించడానికి చిత్ర యూనిట్ అహర్నిశలు శ్రమించి ఎక్కడా రాజీపడకుండా ఈ ఎపిక్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం పనిచేస్తున్నారు. తాజాగా సినిమా టీం ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ దాదాపు నగ్నంగా తన దేహాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. ఇలా కనిపించడానికి చాలా ధైర్యం ఉండాలి. విజయ్ దేవరకొండ బ్రేవ్‌హార్ట్ అని మరోసారి రుజువైయింది. దమ్మున్న కథనంతో వస్తున్న లైగర్ చిరకాలం గుర్తుండిపోయే చిత్రం కాబోతుంది. ఎంఎంఎ ఫైటర్‌గా నటించడానికి విజయ్ దేవరకొండ పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు.

“నా సర్వస్వం తీసుకున్న సినిమా ఇది. నటనా పరంగా, మానసికంగా, శారీరకంగా నా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్. నేను మీకు అన్నీ ఇస్తాను! త్వరలో… లైగర్‌” అని విజయ్ ట్వీట్ చేశారు. లెజెండ్ మైక్‌టైసన్ ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Vijay Devarakonda Poses Nude for LIGER

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News