Wednesday, January 22, 2025

ప్రేమించి పెళ్లి చేసుకుంటా: హీరో విజయ్ దేవరకొండ

- Advertisement -
- Advertisement -

ఖచ్చితంగా లవ్ మేరేజే చేసుకుంటానని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. అయితే తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తన తల్లిదండ్రులకు కూడా నచ్చాలన్నారు. ఇప్పుడే పెళ్లి  చేసుకోనని, కొంత టైమ్ కావాలని అన్నారు. విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ లో తన పర్సనల్ లైఫ్ గురించి విజయ్  మాట్లాడారు.

ఫ్యామిలీ స్టార్ మూవీ అందరికీ నచ్చుతుందని, తెలుగు, తమిళ భాషల్లో 5న విడుదల కాబోతోందని చెప్పారు. రెండు వారాల తర్వాత హిందీలోనూ విడుదలవుతుందన్నారు. విలేఖరుల సమావేశంలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తమిళనాడులో 250 థియేటర్లలో ఫ్యామిలీస్టార్ రిలీజవుతోందన్నారు. ఈ మూవీలో విజయ్ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News