Sunday, January 19, 2025

డేటింగ్‌ రూమర్స్‌.. సమయం వచ్చినప్పుడు చెబుతా: విజయ్‌ దేవరకొండ

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ తన డేటింగ్‌ రూమర్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత కొన్ని రోజులుగా వస్తున్న డేటింగ్ రూమర్స్ పై విజయ్ ఎట్టకేలకు స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని తాను చెబుతానని అన్నారు. తాను సెలబ్రిటీని కావడం వల్ల తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారని.. దానిని తాను తప్పుగా భావించనని రౌడీ బాయ్ తెలిపారు.

కాగా, నేషనల్ క్రష్ రష్మిక మందనతో విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నాడని.. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకే లొకేషన్స్ లో వేర్వుగా దిగిన ఫోటోలను నెటిజన్స్ షేర్ చేస్తూ దొరికిపోయారని కామెంట్స్ చేశారు. అలాగే, గత రెండు సంవత్సరాలు రష్మిక, విజయ్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారని.. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే వీరిద్దరూ తమ ప్రేమను బయట పెట్టే అవకాశం ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News