ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇటీవల విజయ్ హైదరాబాద్ లో రౌడీ బ్రాండ్ స్టోర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పటిలాగే బన్నీకి తన బ్రాండ్ డ్రెస్సులను విజయ్ పంపించాడు. అలాగే.. బన్నీ పిల్లలకు బర్గ్ లు కూడా పంపాడు. దీంతో ఇన్ స్టా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘మై స్వీట్ బ్రదర్.. నువ్వు ఎప్పుడూ ఎదో ఒకటి సర్‌ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్’ అని స్టోరీలో పోస్ట్ పెట్టాడు.
కాగా, అల్లుఅర్జున్ కు గతంలోనూ రౌడీ బ్రాండ్ డ్రెస్సులను విజయ్ గిఫ్ట్ గా పంపిన సంగతి తెలిసిందే. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డమ్ మూవీ చేస్తున్నాడు. ఇక, అల్లుఅర్జున్ పుష్ప2 సినిమా తర్వాత తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో హాలీవుడ్ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ మూవీలో నటించబోతున్నారు.